టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన టీజీ వెంకటేష్ ఆ తర్వాత బీజేపీలోకి జంప్ కొట్టేశారు. తాజాగా టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు కలసి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే ప్రశక్తే లేదని.. ఇది సాధ్యమయ్యే పని కాదని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. అయితే ఎవరు ముఖ్యమంత్రి అనే అంశం గతంలోలేదని, ఇప్పుడు అదే కీలకంగా మారబోతుందని టీజీ వెంకటేష్ చెప్పారు.