భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ గడగడలాడిస్తోంది. ఓ వైపు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్నా కేసులు మాత్రం ఆగడం లేదు. తాజాగా భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. కరోనా రోజువారీ కొత్త కేసుల్లో బ్రెజిల్, అమెరికాను భారత్ దాటేసి.. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానానికి ఎగబాకింది. భారత్‌లో శుక్రవారం 89,129 కరోనా కేసులు, 714 మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో 69,986.. బ్రెజిల్‌లో 69,662 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గత సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.