పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రపంచ రికార్డులో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మూడు వన్డేల సీరిస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ ఇన్సింగ్స్‌లో ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన జాబితాలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. బాబర్ అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 13 వన్డే సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు అయ్యాడు.
కోహ్లి 13 వన్డే సెంచరీలు చేయడానికి 86 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. హషీమ్ ఆమ్లాకు 83 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. కాగా బాబర్ అజమ్ మాత్రం 13 వన్డే సెంచరీలు చేయడానికి 76 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకొని కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.