ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభం కాకముందే కొందరు మాజీ క్రికెటర్లు ఈసారి టైటిల్ ఫేవరెట్ ఎవరు ఉంటారు ? ఎవరి ప్లేస్ ఏంటన్నదానిపై జోస్యం చెపుతున్నారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టెరీస్ తన సోషల్ మీడియాలో బాంబు పేల్చాడు. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ నిలబెట్టుకుంటుందన్నాడు. ఇక రెండో స్థానంలో గతేడాది రన్నరప్ ఢిల్లీ ఉంటుందని... పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు వచ్చే మిగతా రెండు జట్లని తెలిపాడు.
ఆర్సీబీ ఐదో స్థానంలో ఉంటే... రాయల్స్ ఆరో స్థానంలో కేకేఈఆర్ ఏడో స్థానంలో ఉంటే... చెన్నై చివరి స్థానంలో ఉంటుందని జోస్యం చెప్పాడు. ఐపీఎల్ 14వ సీజన్‌లో తొలి మ్యాచ్ డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ మధ్య జరగనుంది.