తెలంగాణ‌లో దుకాణాలు బంద్‌.... క్లారిటీ ఇచ్చిన సీఎస్

VUYYURU SUBHASH
‌తెలంగాణలో కొద్దిరోజులుగా కరోనా వైరస్ కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. స‌గ‌టున రోజుకు 1000కు పైగా కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. దీంతో అటు ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌భుత్వ యంత్రాంగం సైతం బెంబేలెత్తుతోంది. ఇక ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికి అనేక నిబంధనలు విధించింది. మాస్క్ లేకుండా బయటకు వస్తే భారీ జరిమానాలు విధిస్తోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం రాత్రి వేళ‌ల్లో దుకాణాలు మూయాల‌ని జీవో తెచ్చిన‌ట్టు పుకార్లు వ‌స్తున్నాయి.

ఈ పుకార్ల‌పై సీఎస్ సోమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాత్రివేళ దుకాణాలు మూసివేత వార్త తప్పుడు ప్రచారమని సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉండదని సీఎస్‌ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని, ఏ విషయాన్నైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని.. ప్ర‌జ‌లు ఎలాంటి గంద‌ర‌గోళానికి గురి కావ‌ద్ద‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: