వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

VUYYURU SUBHASH
నాగార్జున అక్కినేని  తాజా చిత్రం వైల్డ్ డాగ్ శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. సయామి ఖేర్, అలీ రెజా, దియా మీర్జా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సోలమన్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. నాగార్జున ఇటీవ‌ల వ‌రుస ప్లాపుల‌తో ఉన్నారు. నాగ్ మార్కెట్ పూర్తిగా ప‌డిపోయింది.

ఇక ఇటీవ‌ల నాగ్ ఎంచుకుంటోన్న క‌థ‌ల్లో కూడా ప‌స ఉండ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా వ‌చ్చాయి. ఈ సారి భిన్నంగా కొత్త క‌థాంశంతో వైల్డ్ డాగ్ చేశాన‌ని చెప్పిన నాగ్ ఈ సినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. ఇక వైల్డ్ డాగ్ ట్రైలర్ ఇప్పటికే భారీ హైప్‌ క్రియోట్ చేసింది. ఈ చిత్రంలో నాగార్జున ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వైల్డ్ డాగ్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 9.5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రూ. 9.5 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టాలి.

ప్రపంచవ్యా ప్తంగా వైల్డ్ డాగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ :

నైజాం - రూ. 2.5 కోట్లు

సీడెడ్ - రూ. 1.2 కోట్లు

ఆంధ్రప్రదేశ్- రూ. 4 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బిజినెస్ - రూ. 8.7 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 80 లక్షలు

విదేశాలలో - రూ. 50 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 9 కోట్లు

బ్రేక్ఈవెన్ - రూ. 9.5 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: