ఏపీలో యేడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. కొత్త ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నీలం సాహ్నీ ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఎన్నికలకు ఈ నెల 8న పోలింగ్ నిర్వహించి.... 10న ఫలితాలు వెల్లడిస్తారు. అవసరమైన చోట్ల ఈనెల 9న రీపోలింగ్ ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7,230 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది అభ్యర్థులు .. ఎంపీటీసీ ఎన్నికల బరిలో 19,002 మంది అభ్యర్థులు ఉంటారు. ఇక ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.