కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం..!!

KISHORE
 దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఉదృతంగా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీంతో కేంద్రం కరోనా కు అడుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది. కొత్త మార్గ దర్శకాలను విడుదల చేస్తుంది. తాజాగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రెల్ నెలలో అన్నీ రోజులు టీకా పంపిణీ కొనసాగించేలా చర్యలు చేపడుతుంది.


" గెజిటెడ్ సెలవులలో కూడా టీకా అందజేస్తునట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వ్యాక్సిన్ కేంద్రాలలో రోజు వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతుందన్న కేంద్రం..ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అత్యంత వేగంగా ఎక్కువ మందికి టీకా అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: