ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనతో పాటు భార్య భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను గుంటూరులో ప్రారంభించారు. ఈ క్రమంలోనే జగన్ ఈ రోజు గుంటూరు పర్యటనకు వెళ్లారు. గుంటూరులోని పదో వార్డు కార్యాలయంలో జగన్ దంపతులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట సేపు అబ్జర్వేషన్ లో ఉండాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.