పశ్చిమ బెంగాల్, అసోంలలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 10 గంటల వరకు ఉన్న పోలింగ్ అప్‌డేట్స్ చూస్తే పశ్చిమ బెంగాల్‌లో, అసోంలో 15 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది. ఈ ఓటింగ్ శాతాన్ని చూస్తుంటే సాయంత్రానికల్లా భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఓటర్లు క్యూలో బారులు తీరి ఉన్నారు. ఇక బెంగాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతోన్న ప్రాంతాల్లోనే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ ఎత్తున పోలింగ్ నమోదు అవుతోంది.