భార‌త్‌లో క‌రోనా క‌రాళం.. 24 గంట‌ల్లో కొత్త రికార్డు

VUYYURU SUBHASH
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా స‌గ‌టున రోజుకు 40 వేల‌కు పైగా న‌మోదు అవుతూ వ‌స్తున్నాయి. తాజాగా గ‌త 24 గంట‌ల్లో క‌రోనా కొత్త రికార్డు న‌మోదు చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 72,330 కొత్త  కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. 459 మరణాలు సంభవించాయి. 40,382 మంది ఆసుపతత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక రెండో ద‌శ‌లో మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు కొత్త రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక కోటి 22 లక్షల 21 వేల 665కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య  లక్షా  62 వేల 927 గా ఉంది. ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించనున్నారు. ఇప్పటికి మొత్తం టీకా తీసుకున్నవారి సంఖ్య  6,51,17,896గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: