నేడు బెంగాల్, అసోంలో రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బెంగాల్లో 30 స్థానాల్లో, అసోంలో 39 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. బెంగాల్లో 30 స్థానాల్లో 171 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 75.94 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోన్న నందిగ్రామ్ ఎన్నిక కూడా ఈ రోజే జరగనుంది. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇక్కడ నుంచే బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై పోటీ చేస్తున్నారు.
ఇక అసోంలో 39 స్థానాలకు 345 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 73.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.