హైదరాబాద్ ఐటీ దాడుల్లో కోట్లలో నోట్ల కట్టల బుసలు.. ఎన్ని కోట్లంటే..!
రెండు కంపెనీల్లో చేసిన ఈ సోదాల్లో దాదాపు 700 కోట్ల రూపాయల పై చిలుకు నల్లధనం లావాదేవీలు జరిగినట్లు అధికారులు తేల్చారు. ఈ దాడుల్లో 12 కోట్ల రూపాయల నల్లధనాన్ని అధికారులు సీజ్ చేశారు. రెండు కోట్ల బంగారు ఆభరణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.