బ్రేకింగ్‌: టీడీపీ కీల‌క నేత అరెస్టు

frame బ్రేకింగ్‌: టీడీపీ కీల‌క నేత అరెస్టు

VUYYURU SUBHASH
టీడీపీ కీల‌క నేత‌, కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మునిసిప‌ల్‌ ఎన్నికల సందర్భంగా ఎస్ఐ పై చేయి చేసుకున్న ఘటనలో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు.
 ఎన్నికల విధులకు కొల్లు రవీంద్ర ఆటకం కల్గించారంటూ ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసు నేప‌థ్యంలోనే ఆయనను కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నం లో ఉద్రిక్తత తలెత్తింది. తమ నేతను విడిచిపెట్టాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అంత‌కు ముందు ఓ హ్య‌త కేసు వివాదంలో ఇరుక్కున్న ర‌వీంద్ర కొద్ది రోజులు జైలు శిక్ష అనుభ‌వించిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More