వైసీపీకి ఓటేస్తే ప్ర‌జ‌లు బిచ్చ‌గాళ్ల‌వుతారు

Garikapati Rajesh

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్ర‌జ‌లు బిచ్చ‌గాళ్లుగా మార‌తార‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్నిక‌ల్లో పోటీచేసే ప‌రిస్థితి లేకుండా అధికార వైసీపీ దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు. ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌లో మార్పు తెచ్చేందుకే భార‌తీయ జ‌న‌తాపార్టీతో పొత్తు పెట్టుకున్నామ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు ఆయ‌న మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మార్పు కోస‌మే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డానికి యువ‌త ముందుకువ‌స్తోంద‌ని, అధికార పార్టీ దౌర్జ‌న్యాల‌కు జ‌న‌సైనికులు ఎదురొడ్డి నిలిచార‌ని కొనియాడారు. ప‌న్నుల రూపంలో వ‌చ్చిన సొమ్మును న‌చ్చిన పేర్లు పెట్టుకొని ప‌థ‌కాల రూపంలో ప్ర‌జ‌ల‌కు పంచుతున్నార‌ని, అర్హుల‌కు పింఛ‌న్లు, ప‌థ‌కాలు ఆప‌డం దారుణ‌మ‌ని విమ‌ర్శించారు. ప‌థ‌కాలు తొల‌గిస్తామ‌ని బెదిరిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌శ్నించ‌డం మానుకుంటే ఏపీలో దారుణాలు ఇంకా కొన‌సాగుతూనే ఉంటాయ‌ని, వైసీపీకి ఓటేస్తే ప్ర‌జ‌ల‌ను బిచ్చ‌గాళ్లుగా చేస్తార‌ని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: