ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఎన్ని నామినేష‌న్లు అంటే..

VUYYURU SUBHASH
కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ తెలిపారు. కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానానికి గంధం నారాయణరావు, పలివెల వీర్రాజు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేయగా.. తూర్పు-పశ్చిమగోదావరి ఎమ్మెల్సీ స్థానానికి నాగసరం నరసింహం, యర్రాకుల తులసీరాం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని చెప్పారు. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ఉపాధ్యాయ సంఘాలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: