డ్ర‌గ్స్‌తో దొరికేసిన బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు

VUYYURU SUBHASH
కారులోనే మ‌త్తు ప‌దార్థాలు స‌ర‌ఫ‌రా చేస్తోన్న ఓ బీజేపీ మహిళా నాయ‌కురాలితో పాటు మ‌రో ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. బీజేపీ మహిళ నాయకురాలు పమేలా గోస్వామి, తన స్నేహితుడితో కలిసి కోల్‌కతాలోని నయూ అలీపూర్‌ ప్రాంతంలోని ఎన్‌ఆర్‌ అవెన్యూకు వెళ్తున్నారు. అయితే అప్పటికే బీజేపీ నాయకురాలు ఒకరు మత్తు పదార్థాలు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల త‌నిఖీలో ఆమె కొకైన్ త‌ర‌లిస్తున్న‌ట్టు తేలింది. ఆమె దగ్గర నుంచి 100 గ్రాముల కొకైన్‌ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

పోలీసులు ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్ ప్రబీర్ కుమార్ దేవ్‌తో పాటు ఓ బాడీగార్డును కూడా అరెస్టు చేసి ఆరా తీస్తున్నారు. దీనిపై బీజేపీ నాయ‌కులు స్పందిస్తూ కారులో ఎవ‌రైనా కొకైన్ పెట్టారేమో ? అన్న సందేహాలు వ్య‌క్తం చేశారు. ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసిన పమేలా ఆ తర్వాత మోడలింగ్‌, టీవీ సీరియల్స్‌లో నటించారు. 2019లో బీజేపీలో చేరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: