17 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో...

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఉష్ణోగ్రత 6.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. 17 ఏళ్ళ తర్వాత అత్యంత శీతలమైన నవంబర్‌ గా మారింది అని ఢిల్లీ సర్కార్ చెప్పింది. సఫ్దర్‌జంగ్ బేస్ స్టేషన్ వద్ద కనిష్టంగా 6.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు చేయగా, లోధి రోడ్ స్టేషన్‌లో 6.4 డిగ్రీల సెల్సియస్ నమోదైందన్ని జాతీయ మీడియా పేర్కొంది. రాజధానిలో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 8.5 డిగ్రీల సెల్సియస్‌ను నమోదు చేసింది.
నగరంలో 17 సంవత్సరాలలో అత్యంత చలి ఉన్న రోజు నేడే. చలి గాలుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది అని, ఉష్ణోగ్రత సోమవారం నుంచి పెరిగే అవకాశం ఉందని ఐఎండి ప్రాంతీయ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. 7.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, నవంబర్ 29, 2006 నవంబర్ నెలలో నమోదు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: