స్పీకర్‌ తమ్మినేనికి తప్పిన ప్రమాదం..!

N.ANJI
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు పెనుప్రమాదం తప్పింది. స్పీకర్ తమ్మినేని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా వంజంగి వద్ద కాన్వాయ్‌లోకి ఓ ఆటో వేగంగా దూసుకుని వచ్చింది.  ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండటంతో స్పీకర్ తమ్మినేని సీతారాంకు పెను ప్రమాదం తప్పింది. 


శనివారం మధ్నాహ్నం శ్రీకాకుళం కలెక్టరేట్‌ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన ఆటో పూర్తిగా ధ్వంసమైంది. స్పీకర్ కాన్వాయ్ వాహనం కూడా స్వల్పంగా దెబ్బతింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: