ఉన్మాది ఘాతకం.. యువతిపై కత్తితో దాడి

N.ANJI
సమాజంలో యువతులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని నిర్భయ చట్టాలు చేసినా వాటి వల్ల ప్రయోజం కరువైందని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ యువ‌తిపై ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఇల్లందులోని స‌త్య‌నారాయ‌ణ‌పురంలో చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి 23 ఏళ్ల యువ‌తిపై ఓ గుర్తుతెలియని యువకుడు క‌త్తితో దాడిచేశాడు. అనంత‌రం ఆమెను స‌మీపంలోని ముళ్ల పొద‌ల్లో ప‌డేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అదే క్ర‌మంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా అతను రోడ్డుపై తిరుగుతూ కనిపించాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని విచారణ జరుపుతున్న క్రమంలో చేతులకు రక్తపు మరకలు కనిపించాయి. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అస‌లు విష‌యం బయటపడింది. యువ‌తిపై దాడిచేసిన‌ట్లు అతడు ఒప్పుకున్నాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముళ్లపొద‌ల్లో అప‌స్మార‌క స్థితిలో ఉన్న యువ‌తిని ఇల్లందు ఆస్పత్రికి త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ఖ‌మ్మం ప్ర‌భుత్వ ద‌వాఖానాకు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: