జేఎన్​టీయూహెచ్ ప్రకటన.. మళ్లీ పరీక్షలు వాయిదా..!

Lokesh
జేఎన్​టీయూహెచ్ పరిధిలో శుక్రవారం జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసినట్టు రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. డిగ్రీ, పీజీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు కూడా వాయిదా వేసినట్టు వెల్లడించారు. పరీక్ష జరిగే తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు.భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బ తినడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు షెడ్యూలు ప్రకారం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.


హైదరాబాద్ జీడిమెట్ల ఫాక్స్​సాగర్ చెరువుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 37 అడుగులు కాగా... ప్రస్తుతం 33 అడుగులకు చేరింది. ఇలాగే వరద కొనసాగితే... దిగువన ప్రాంతాలైన సుభాశ్ నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షాపూర్​నగర్​కు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: