బ్రేకింగ్:ఏపీ స్పీకర్, మంత్రి కొడాలి నానీపై సిబిఐ విచారణకు హైకోర్ట్ ఆదేశం...!

హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియా లో చేసిన అభ్యంతరకర  వ్యాఖ్యలపై సీబీఐ విచారణకు ఆదేశించింది ఏపీ హైకోర్ట్. సభాపతి తమ్మినేని, మంత్రి కొడాలి నాని, మాజీ ఎం ఎల్ ఏ ఆమంచి సహా పలువురు వైసీపీ నేతల వ్యాఖ్యలపై కేసుని సిబిఐ కి అప్పగించింది. సీ బీ సి ఐ డి విచారణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ కు ఆదేశించిన హైకోర్టు... రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కి సహకరించాలి అని సూచించింది.

8 వారాల్లోగా నివేదిక అందించాలి అని సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల జడ్జిలపై వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల దీనికి సంబంధించి విచారణ జరగగా తీర్పుని ఏపీ హైకోర్ట్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నేడు తీర్పు వెల్లడించింది హైకోర్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: