కరోనా నియంత్రణలో.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం..?

praveen

దేశంలో  కరోనా  వైరస్ విలయ తాండవం చేస్తూ బ్రేక్ డాన్స్ చేస్తుంది.  ఈ నేపథ్యంలో రోజురోజుకీ మహమ్మారి కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కొన్ని రాష్ట్రాల్లో  అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. భారీగా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం పాతుకు పోతుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి . రాష్ట్రాల్లో  కరోనా  ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నాయి . మొన్నటివరకు కర్ణాటక లో కరోనా  ప్రభావం అతి తక్కువగా కనిపించగా..  ఇటీవలే మాత్రం వరుసగా ప్రతి రోజూ నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  దీంతో  ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. 

 

 ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్ కరోనా  నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తూ  నిర్ణయం తీసుకుంది కర్ణాటక సర్కార్. పండుగల సీజన్ మొదలవుతున్న  నేపథ్యంలో.. కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య పండుగలు నిర్వహించాలా  వద్దా అనే దానిపై కూడా ప్రస్తుతం మత పెద్దలతో సమీక్షలు జరుగుపుతుంది  కర్ణాటక సర్కార్ . ప్రజలు భారీగా  సంబరాలు కాకుండా నిరాడంబరంగా ఇంట్లోనే అన్ని పండుగలు జరుపుకునే మార్గదర్శకాలను కూడా జారీ చేసేందుకు సిద్ధమవుతోంది సర్కార్ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: