చిలుకూరు ఆలయంలో ప్రవేశించిన కూర్మ మూర్తి.... కరోనాపై విజయానికి సంకేతమా....?

Reddy P Rajasekhar

చిలుకూరు బాలాజీ ఆలయంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఎలాంటి మార్గం లేకపోయినా ఆలయంలోకి తాబేలు ప్రవేశించింది. ఆలయంలోకి ప్రవేశించడానికి చిన్న మార్గం కూడా లేకపోయినా శివాలాయంలోకి తాబేలు రావడంపై పూజారి సురేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాదాపు పది సెంటీ మీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పున్న తాబేలు ఆలయంలోకి ఎలా వచ్చిందో తెలియడం లేదని ఆయన అన్నారు. 
 
చిలుకూరు బాలాజీ ఆయన ప్రధాన పూజారి రంజరాజన్ ఆలయంలోకి తాబేలు రావడం శుభసూచికమని త్వరలో కరోనా విషయంలో శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ఆలయంలోకి కూర్మ మూర్తి ప్రవేశం వైరస్ అంతమై అమృతం లభిస్తుందని సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి సూచిస్తున్నట్లు ఉందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. చిలుకూరులో సుందరేశ్వర స్వామి సన్నిధిలో తాబేలు ప్రత్యక్షం కావడంతో త్వరలోనే కరోనా విషయంలో శుభవార్త వింటామని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: