డ్రాగన్ కు భారీ షాక్ ఇచ్చిన టిక్ టాక్... ఇకపై అమెరికా హస్తగతం కానున్న యాప్....?

Reddy P Rajasekhar

గత కొన్ని నెలలుగా డ్రాగన్ దేశానికి ప్రపంచ దేశాల నుంచి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా చైనాకు టిక్ టాక్ భారీ షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ యాప్ అమెరికా హస్తగతం కానుంది. అమెరికా కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న వేళ టిక్‌టాక్‌ తమ ప్రధాన కార్యాలయాన్ని మరో దేశానికి మార్చాలని భావిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారుడు ల్యారీ కుడ్లో చేసిన వ్యాఖ్యలను బట్టి టిక్ టాక్ అమెరికా హస్తగతం కానుందని తెలుస్తోంది. 
 
ల్యారీ కుడ్లో తాజాగా టిక్‌టాక్‌ తన మాతృ సంస్థ బైట్‌డాన్స్ నుంచి విడిపోయి అమెరికా సంస్థగా సేవలు కొనసాగించే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. టిక్ టాక్ అమెరికా సంస్థ చేతిలోకి వెళితే భారత్ కూడా ఆ యాప్ ను అనుమతించే అవకాశాలు ఉన్నాయి. భారత్ చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం కేంద్రం టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: