మస్కట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన మరో చార్టెడ్ ఫ్లైట్..?
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ విమానాలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది విదేశాల్లో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది తెలంగాణ వాసులు మస్కట్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే మస్కట్ లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణవాసులను స్వదేశానికి రప్పించేందుకు ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ వింగ్ సహకారంతో చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసారు. ఈ క్రమంలోనే మస్కట్ నుంచి హైదరాబాద్కు మరో చార్టెడ్ ఫ్లైట్ ప్రారంభమైంది.
ఈ చార్టడ్ విమానం మస్కట్ నుండి హైదరాబాద్ బయలుదేరినట్లు సామాజిక కార్యకర్త నరేంద్ర పన్నీరు చెప్పుకొచ్చారు. అయితే ఈ చార్టడ్ ఫ్లైట్ మస్కట్ నుంచి హైదరాబాద్ కు రప్పించేందుకు తనతో పాటు మరికొంతమంది కోర్ కమిటీ సభ్యులు కూడా కృషి చేశారని తాజాగా సామాజిక కార్యకర్త నరేంద్ర పన్నీరు తెలిపారు. ఇక ఈ ఛార్జ్ ఫ్లైట్ లో ఎన్ని రోజుల వరకు మస్కట్ లో విమాన సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ వాసులు స్వదేశానికి చేరుకోనున్నారు.