నా బయోపిక్ లో నేనే హీరో గా చేస్తా : సోను సూద్
లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను స్వస్థలాలకు చేరేందుకు చేయూతనిచ్చి సోనూసూద్ విలన్ కాస్త హీరోగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి సోనూసూద్ పై ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా దీనిపై స్పందించిన సోనూ ఆసక్తికర విషయం వెల్లడించారు.
ఒకవేళ నిజంగా నా బయోపిక్ తీస్తే అందులో నా పాత్ర నేనే పోషిస్తా.. ఎందుకంటే నా జీవితంలో ఎదురైన అనుభవాలు నాకన్నా బాగా ఇంకెవరికి తెలుస్తాయి అంటూ సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గతంలో తనకు జీవితంలో ఎదురైన అనుభవాలతో అన్నింటినీ కలిపి ఒక పుస్తకం రాస్తాను అంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. మరి సోను సూద్ తన బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దర్శకులు ఎవరైనా సోనూసూద్ ని సంప్రదిస్తారా అన్నది చూడాలి మరి.