ఇక ఆ దేవుడే కాపాడాలి.. ఆరోగ్య శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు..?

praveen

కర్ణాటకలో రోజురోజుకు కరోనా  వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రాష్ట్రంలో కరోనా  మాత్రం కంట్రోల్ లోకి రావడం లేదు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే  కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు ఇక ఆ దేవుడు కరోనా  వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించాలి అంటూ వ్యాఖ్యానించారు. 

 

 ఈ మహమ్మారి కరోనా  వైరస్ ను పూర్తిగా నియంత్రించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కరోనా  వైరస్ ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రాములు.. ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాధిని నియంత్రించడం ఎవరి చేతుల్లో లేదని ప్రజలు ముందు అవగాహన రావాలి అంటూ ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: