హ్యాండ్ శానిటైసర్ పై జీఎస్టీ స్పష్టం చేసిన కేంద్రం..?

praveen

తాజాగా హ్యాండ్ శానిటైజర్ లు కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శానిటైజర్ లు కూడా సబ్బులూ బాక్టీరియా లిక్విడ్ లాంటి వాటి కిందికే వస్తాయి అని అందుకే... శానిటైజర్ 18% జిఎస్టి కిందకి  వస్తాయి అంటూ తెలిపింది కేంద్ర ప్రభుత్వం. శానిటైజర్ తయారీ కోసం ఉపయోగించే రసాయనాలు అన్ని 18% జిఎస్టి కిందే ఉన్నాయని... ఒకవేళ శానిటైజర్ తదితర వస్తువుల పై జిఎస్టి తగ్గించినట్లైతే  అది పన్నుల విధానాన్ని అస్థిర పరుస్తుందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం, 

 


 తద్వారా తక్కువ జీఎస్టీ రేట్లతో ధరలు చౌకగా మారి  భారతదేశంలోకి దిగుమతులు ఎంతగానో పెరిగిపోతాయని.. ఇది కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆత్మ నిర్బర్  భారత్ విధానానికి పూర్తిగా విరుద్ధం అంటూ తెలిపింది. ఇలా అస్థిరత్వ పన్ను  విధానం కారణంగా దేశీయ తయారీదారులు నష్టపోయే అవకాశం ఉందని తద్వారా వినియోగదారులు  సరైన ప్రయోజనం పొందలేరు అంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: