ప్రజలకు మహేష్ బాబు ట్విట్టర్ సందేశం.... వైరస్ నుంచి కాపాడుకోవడానికి సలహాలిచ్చిన సూపర్ స్టార్....?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపుల అనంతరం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ప్రజలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. మహేష్ తన ట్వీట్లో లాక్ డౌన్ సడలింపుల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని... ఇది మనల్ని మనం రక్షించుకోవాల్సిన సమయం అని పేర్కొన్నారు. 
 
బయటకు వచ్చే సమయంలో మాస్కు తప్పనిసరిగా ధరించాలని... పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవాలని... సామాజిక దూరం పాటించాలని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో మహేష్ ట్వీట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు మహేష్ బాబులా ఇతర స్టార్ హీరోలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు సందేశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: