అసోంలో వరద భీభత్సం.... ప్రభావితమైన 9 లక్షల మంది....?
అసోం రాష్ట్రంలో మూడు రోజుల క్రితం వరదలు భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వరదలు 4 జిల్లాల్లోని 99 గ్రామాలను అతలాకుతలం చేయడంతో పాటు 23 జిల్లాల్లోని ప్రజలపై ప్రభావం చూపాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు రావడంతో 9,26,059 మందిపై ప్రభావం పడిందని రాష్ట్ర విపత్తు, నిర్వహణ శాఖ పేర్కొంది. 23 జిల్లాలపై వరదలు ప్రభావం చూపినట్లు అధికారులు చెబుతున్నారు.
అసోం రాష్ట్రంలోని ధేమాజి, లక్ష్మీపూర్, బిశ్వనాథ్, ఉదాల్ గిరి, దారంగ్, నల్బరి, బార్ పేట, కోక్రాజర్, ధుబ్రి, సౌత్ సల్మారా, గోల్ పూరా, కరంప్ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో 4.3 వేల హెక్టార్ల పంట నీటమునిగిందని సమాచారం.
According to assam State Disaster Management Authority, 9,26,059 people affected in 23 districts including Dhemaji, Lakhimpur, Biswanath, Udalgiri, Darrang, Nalbari, Barpeta, Bongaigaon, Kokrajhar, Dhubri, South Salmara, Goalpara & Kamrup, due to flood situation. — ANI (@ANI) June 29, 2020