నో టెన్షన్... గుడిలో తీర్థం పోసే యంత్రాలు....?

Reddy P Rajasekhar

లాక్ డౌన్ వల్ల చాలా కాలం పాటు మూసివేసిన ఆలయాలు ఈ నెల 8వ తేదీ నుంచి తెరచుకున్నాయి. ప్రస్తుతం ఆలయాలలో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కేంద్రం ఆదేశాల ప్రకారం ఆలయాల్లో గంటలు కొట్టడాలు, తీర్థం అందజేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే దీనికి చెక్ పెట్టేందుకు ఒక వ్యక్తి కర్నాటకలోని మంగుళూరు ఆలయంలో తీర్థం పోసే యంత్రాన్ని తయారు చేసి ఏర్పాటు చేశాడు. 
 
ఆటోమేటిక్ గా పని చేసే ఈ యంత్రం దగ్గర భక్తులు చేతులు పెడితే సెన్సార్లు తీర్థాన్ని పంపిణీ చేస్తాయి. పూజారులతో పనిలేకుండా తీర్ణం పంపిణీ జరుగుతుండటం వల్ల కరోనా సోకుతుందనే భయం అవసరం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ అనే వ్యక్తి తీర్థం పంపిణీ చేసే యంత్రాన్ని తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: