జవాన్ల మృతి నా హృదయాన్ని కదిలించింది : చిరంజీవి
లఢక్ లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో సోమవారం రోజు రాత్రి భారత్ చైనా సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఆ వీర సైనికుల త్యాగాలను రాజకీయ, సినీ ప్రముఖులు... ప్రజలు కొనియాడుతున్నారు. వారి కుటుంబాలకు సోషల్ మీడియా ద్వారా సానుభూతిని తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వీరజవాన్ల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ట్వీట్లు చేశారు.
ధైర్యవంతులైన భారత జవాన్లు వీర మరణం పొందడం తన హృదయాన్ని కలచివేసిందని... తెలుగు కుర్రాడు కల్నల్ బిక్కుమల్లా సంతోష్ బాబు మన దేశం కోసం ప్రాణాలు అర్పించడం హక్కు అని చేసిన వ్యాఖ్యలు గర్వించదగినవని అన్నారు. సైనికులకు సలాం... సైనికుల కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. విక్టరీ వెంకటేష్, అమితాబ్ సోషల్ మీడియా ద్వారా సానుభూతిని తెలియజేశారు.
My heart goes out to the bereaved families of 20 brave indian soldiers incl.Telugu boy Col.Bikkumalla santhosh babu.Despite the tragic loss,his parents call it a privilege to make this supreme sacrifice for our nation.Salute their bravery & pray for strength to the families🙏🙏🇮🇳 — chiranjeevi konidela (@KChiruTweets) June 17, 2020