బ్రేకింగ్ : చైనాకు భారత్ భారీ షాక్... 500 ఉత్పత్తుల బహిష్కరణ..?

Reddy P Rajasekhar

లడఖ్ లో చైనా సైన్యం భారత సైన్యంపై దాడి చేయడం గురించి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి జరిగిన దాడిలో 20 మంది భారత సైనికులు, 43 మంది చైనా సైనికులు మరణించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఘటనతో చైనాకు బుద్ధి చెప్పాలని దేశంలోని వ్యాపారులంతా నిర్ణయించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ చైనాను దెబ్బ తీసేందుకు సిద్ధమైంది. 
 
చైనాకు సంబంధించిన 500 వస్తువుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసి వాటిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. బొమ్మలు, దుస్తులు, బిల్డర్ హార్డ్‌వేర్, పాదరక్షలు, వంటగది సామాను, చేతి సంచులు, రోజువారీ వినియోగ వస్తువులు, ఫర్నీచర్, లైటింగ్, ఆరోగ్య ఉత్పత్తులు, ప్యాకేజింగ్ ఉత్పత్తులు, ఆటో విడి భాగాలు, ఎలక్ట్రికల్ ప‌రిక‌రాలు, ఆహార ప‌దార్థాలు, గడియారాలు, రత్నాలు, ఆభరణాలు వీటిలో ఉన్నాయని తెలుస్తోంది. వ్యాపారులు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా చైనాకు ఆర్థికంగా నష్టం కలగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: