బెజవాడ రౌడీ షీటర్లపై పోలీసుల ఉక్కుపాదం..?

frame బెజవాడ రౌడీ షీటర్లపై పోలీసుల ఉక్కుపాదం..?

praveen

బెజవాడలో గ్యాంగ్ వార్  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. గ్యాంగ్ వార్ ఏకంగా  పోలీసులకు సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో బెజవాడలో రౌడీషీటర్ల పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచారు పోలీసులు. ఏకంగా బెజవాడ కమిషనరేట్ పరిధిలో 470 మంది రౌడీషీటర్ల గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు.

 


 ప్రతి వారం  ఈ రౌడీషీటర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక అటు బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ గ్యాంగ్ వార్ ఘటనలో నిందితులకు కోసం ఏకంగా ఆరు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. బెజవాడ గ్యాంగ్ వార్ లో పాల్గొన్న మరో 15 నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు పోలీసులు . నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అంటూ హెచ్చరి స్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More