బ్రేకింగ్ : దేశ ప్రజలకు శుభవార్త... చైనా వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు...?
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 12,000 కేసులు నమోదు కాగా కరోనా మృతుల సంఖ్య 9,000 దాటింది. ప్రతిరోజూ దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రించగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజాగా చైనా బయోఫార్మా కంపెనీ సినోవాక్ బయోటెక్ కరోనావ్యాక్ పేరిట అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పరీక్షలో పురోగతి చోటుచేసుకున్నట్టు కంపెనీ తెలిపింది.
ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని, రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడంలో మెరుగైన సామర్థ్యం కలిగి ఉంటుందని సినోవ్యాక్ పేర్కొంది. రెండు దశల పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని.... బ్రెజిల్ లో్ మూడో దశ పరీక్షలను నిర్వహించనున్నామని సంస్థ తెలిపింది. పరీక్షించిన వారిలో 90 శాతానికి పైగా ఎలాంటి తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని.... రెండు వారాల్లో యాంటీ బాడీలను విజయవంతంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలదని సంస్థ పేర్కొంది.