జేసీ దివాకర్ కు భారీ షాక్.... ఆ వాహనాలు ఎక్కడున్నా సీజ్ చేయాలని ఆదేశాలు...?
జేసీ దివాకర్ రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. జేసీ ట్రావెల్స్ 154 బీఎస్-3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిందని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు ఈరోజు మీడియాకు తెలిపారు. జటాధర ఇండస్ట్రీస్ పేరుతో 50 వాహనాలను, సి.గోపాల్‌రెడ్డి పేరుతో 104 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని మిగిలిన వాహనాలు కర్ణాటక, తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిపారు.
ఈ వాహనాలపై అనంతపురంలో 27, కర్నూలులో 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని... ఈ వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు. కేంద్రాన్ని దేశంలో ఈ వాహనాలు ఎక్కడ తిరుగుతున్నా సీజ్ చేసేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఇప్పటికే 103 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేశాఅని చెప్పారు. జేసీ ఉమారెడ్డి, జేసీ అశ్మిత్‌రెడ్డి జటాధర ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్నారని ఆయన అన్నారు. వాహనాలను సీజ్ చేయడం జీసీ దివాకర్ కు భారీ షాక్ అనే చెప్పవచ్చు.