తీవ్ర అస్వస్థతకు గురైన డైరెక్టర్ సంజనా రెడ్డి..... ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ ప్రచారం...?

Reddy P Rajasekhar

టాలీవుడ్ ఇండస్ట్రీకి రాజుగాడు సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన సంజనా రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండేళ్ల విరామం తరువాత కరణం మల్లేశ్వరి బయోపిక్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమె అస్వస్థతకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 
అయితే ప్రముఖ రైటర్ కమ్ నిర్మాత కోన వెంకట్ ఈ వార్తలపై స్పందించారు. సంజన మూడు రోజులుగా లిక్విడ్ డైట్‌లో ఉండటం వల్ల కళ్లు తిరిగి కింద పడిపోయారని... ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని... హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారని చెప్పారు. కరణం మల్లేశ్వరి బయోపిక్‌కు సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయని... త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని సంజనా రెడ్డి ఆరోగ్యం గురించి కోన వెంకట్ స్పష్టత ఇచ్చారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: