అల్లు అర్జున్ అరెస్టు వెనుక రేవంత్ రెడ్డి కుట్ర ఉంది అని ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని ఖండించారు. నాకు అల్లు అర్జున్ పై ఎలాంటి ద్వేషం,పగ, కుట్ర లేవు.. నేనెందుకు ఆయనని అరెస్టు చేస్తాను..చట్టం తన పని తాను చేసుకుపోతుంది అందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక మహిళ చనిపోయి ఆ మహిళ కొడుకు చావు బతుకుల మధ్య ఉంటే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నేను ప్రభుత్వం తరఫున స్పందించాను అంతే అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు.అలాగే అసెంబ్లీలో అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసి కన్ను పోయిందా కాలు పోయిందా అంటూ విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి మాటలు అన్ని చూస్తూ ఉంటే అల్లు అర్జున్ పై పగ పెంచుకున్నారని అల్లు ఫ్యాన్స్ అర్థం చేసుకుంటున్నారు.
అయితే పుష్ప టు సక్సెస్ ఈవెంట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లనే పగ పెంచుకున్నారని అందరూ అనుకుంటున్నారు.కానీ 2011 నుండే అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డికి మధ్య మనస్పర్దలు ఉన్నట్టు తెలుస్తుంది.మరి ఇంతకీ 2011లో ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాక ఎంతో మంది దర్శకులు ఆయన సినిమా ద్వారా ఫేమస్ అయ్యారు.అయితే గతంలో అంటే 2011లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తరుణంలో తన సన్నిహితులు కొంతమంది మేము సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి ప్రొడ్యూసర్లుగా మారాలి అని చూస్తున్నాం అంటూ రేవంత్ రెడ్డికి చెప్పారట.
ఇక రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి అల్లు అర్జున్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయన్ని కలిసారట.మా సన్నిహితులు మీతో ఒక సినిమా తీయాలి అనుకుంటున్నారు. వాళ్లని నిర్మాతలుగా మీరే ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని చెప్పారట. కానీ అల్లు అర్జున్ మాత్రం దానికి ఒప్పుకోలేదట. అంతే కాదు రేవంత్ రెడ్డి తో కాస్త దురుసుగా మాట్లాడారట.ఇక అప్పటినుండి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. 2011లో జరిగిన ఈ విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తనపై పగా తీర్చుకున్నారు అంటూ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతుంది