2 మిలియన్ల కరోనా వ్యాక్సిన్లు సిద్ధం.... ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇప్పటికే 2 మిలియన్ల కరోనా వ్యాక్సిన్లను తయారు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాకిన్లకు భద్రతా పరిశోధనలు పూర్తి అయితే ఉపయోగించటానికి సిద్ధంగా ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పరీక్షలు పూర్తైన తరువాత వ్యాక్సిన్ల సరఫరాకు తాము సిద్ధంగా ఉంటామని ఆయన వెల్లడించారు. 
 
వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2021 ప్రారంభానికి ముందే మిలియన్ డోసుల వ్యాక్సిన్లు అమెరికా వద్ద ఉండాలని భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. కరోనా టీకా‌ తయారీలో అద్భుత పురోగతి సాధిస్తున్నామని.... వ్యాక్సిన్‌ అభివృద్ధిలో సానుకూల ఫలితాలు అందుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: