షాకింగ్ : బైక్ కోసం భార్యనే అమ్మకానికి పెట్టిన భర్త... ఏం జరిగిందంటే...?

Reddy P Rajasekhar

ఈ మధ్య కాలంలో వరకట్నం కోసం, బైక్... కార్ల కోసం భార్యను, అత్తామామలను వేధించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బైక్ పై ఇష్టంతో ఒక వ్యక్తి తన భార్య ఆత్మ గౌరవాన్ని సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టాడు. పూర్తి వివరాలలోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని మెహ్ నగర్ లోని తుథియా గ్రామానికి చెందిన పునీత్ కొన్నేళ్ల క్రితం కొత్వాలీ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 
 
వివాహం అనంతరం భార్యను, అత్తామామలను బైక్ కావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు భరించలేక మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన పునీత్ తన భార్య సెల్ ఫోన్ నంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డబ్బులు చెల్లించి మహిళతో మాట్లాడవచ్చాని, సమయం గడపవచ్చని పోస్ట్ చేశాడు. దీంతో ఆమెకు అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ పని చేసింది భర్తేనని తెలియడంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పునీత్ పై కేసు నమోదు చేసి అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: