పేస్ బుక్ తో దశాబ్దాల మ్యూజిక్ లేబుల్ తో ఒప్పందం..?
ఫేస్బుక్ భారతదేశంలో అతిపెద్ద మ్యూజిక్ లేబుల్‌తో గ్లోబల్ లైసెన్సు ఒప్పందాన్ని తాజాగా చేసుకుంది . ఈ ఒప్పందంపై సంతకం చేసింది ఫేస్బుక్ వినియోగదారులు తమ ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ పోస్టుల కోసం... బాలీవుడ్ సంగీతం యొక్క పెద్ద కేటలాగ్ నుంచి ఎంచుకోవడానికి కల్పించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్టు సంగీత సంస్థ వెల్లడించింది. సరిగమప ఇండియా లిమిటెడ్ షేర్లు ఈ ఒప్పందం తో .. ఒక్కసారిగా 20 శాతం పెరిగాయి.
ఫేస్బుక్ తో ఒప్పందం చేసుకుంది కానీ ఆర్థిక వివరాలు మాత్రం వెల్లడించలేదు ఆ సంగీత సంస్థ. సరిగమప యొక్క లేబుల్ లో లక్ష కంటే ఎక్కువ పాటల జాబితా 25 భాషలలో విస్తరించి ఉంటుంది అంటూ సదరు సంస్థ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రపంచ వ్యాప్తంగా మా ఫ్లాట్ ఫార్మ్ లను వ్యక్తులను మరియు వారికి ఎంతగానో ఇష్టపడే కంటెంట్ ను మరింత సుసంపన్నం చేయడానికి ఉపయోగపడుతుంది అని ఫేస్బుక్ ఇండియా డైరెక్టర్ భాగస్వామి మనిష్ చోప్రా వెల్లడించారు.