వరంగల్ 9 హత్యల కేసులో కొత్త కోణం... ఒక హత్యను కప్పిపుచ్చేందుకు 9 హత్యలు...?

Reddy P Rajasekhar

గొర్రెకుంట 9 హత్యల కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఒక హత్యను కప్పిపుచ్చేందుకు 9 హత్యలకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. మొదట సంజయ్ కుమార్ మక్సూద్ బంధువైన ఒక యువతిని హత్య చేశాడు. మార్చి 8వ తేదీన ఆమెను నిడదవోలు దగ్గర రైలు నుంచి తోసేసి సంజయ్ హత్య చేశాడు. 
 
ఈ విషయాన్ని మక్సూద్ కుటుంబ సభ్యులు పోలీసులకు చెబుతారని భావించి 10 మందిని నిందితుడు హత్య చేశాడు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిందితుడిని వరంగల్ సీపీ రవీందర్ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నాడు. గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాం దగ్గర బావిలో శవాలై తేలిన 9 మందిని హత్య చేసింది సంజయ్ కుమార్ యాదవ్ అనే సంగతి తెలిసిందే. కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చిన సంజయ్ వారు అపస్మారక స్థితిలోకి వెళ్లాక గోనె సంచుల్లో లాక్కెళ్లి వారిని బావిలో పడేసినట్టు అంగీకరించాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: