గాంధీ కరోనా రోగి మిస్సింగ్ కేసులో బండి సంజయ్ ఎంట్రీ... భర్తను అప్పగించాలంటూ మాధవి డిమాండ్...?
గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన మధుసూదన్ అనే వ్యక్తికి జీ.హెచ్.ఎం.సీ అంత్యక్రియలు నిర్వహించిందని మంత్రి ఈటల రాజేందర్, గాంధీ ఆస్పత్రి వైద్యులు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో మాధవి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తన భర్తను తనకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. డాక్టర్లు తన భర్తకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారని బండి సంజయ్ కు తెలిపారు.
ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ మధుసూదన్‌కు ఎం జరిగినా అది ప్రభుత్వ హత్యే అవుతుందని... మధుసూదన్‌ను ప్రాణాలతో అప్పగిస్తే సీఎం కేసీఆర్‌ను సన్మానిస్తానని.... ప్రభుత్వం వాదనకు, గాంధీ ఆస్పత్రి రికార్డులకు పొంతన కుదరడం లేదని చెప్పారు. మధుసూదన్ భార్య తన భర్త ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని అన్నారు. జీహెచ్ఎంసీ అంత్యక్రియలు ఎక్కడ చేసిందో చెప్పాలని అన్నారు.