ఒకప్పుడు బాగా దగ్గరగా బతికిన రోజుల్లో : బ్రహ్మాజీ
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన నటుల్లో ఒకరు బ్రహ్మాజి. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి బ్రహ్మాజి తర్వాత హీరోగా కూడా నటించాడు. అప్పట్లో కృష్ణ వంశి దర్శకత్వంలో ‘సింధూరం’ మూవీలో బ్రహ్మాజీ హీరోగా నటిస్తే.. మాస్ మహరాజ రవితేజ చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత జేడీ చక్రవర్తి నటించిన గులాబి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో కామెడీ, విలన్, క్యారెక్టర్ ఇలా ఏ పాత్రలకైనా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసేవారు బ్రహ్మాజి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సెలబ్రెటీలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు ఐనవాళ్లు స్నేహితులు దూరమవుతూ వస్తున్నారు. ఎంతో అనుబంధం, స్నేహం ఉన్న వ్యక్తికి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
కలిసి భోజనాలు చేయడం, పక్కన కూర్చొని మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ పూర్తిగా బంద్ అయ్యాయి. కవేళ బయటకు వచ్చినా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అయిపోయింది. ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా కామెడీగా వెల్లడించాడు. 'ఒకప్పుడు బాగా దగ్గరగా బతికిన రోజుల్లో', 'బాగా అతికిన రోజుల్లో' అంటూ ఫొటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోల్లో తనతో కలిసి ఒకప్పుటి ఫోటోల్లో ఉన్న నటులు.. రవితేజ, సుబ్బరాజు, డైరెక్టర్లు హరీశ్ శంకర్, మెహర్ రమేశ్, బీవీఎస్ రవిలతో కలసి పార్టీ చేసుకున్న ఫొటో... 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయితేజ్, అలీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు.
Okappdu baga dhaggiriga bathikina Rojullo ..😀 pic.twitter.com/fxoHxpGgcc — BRAHMAJI (@actorbrahmaji) May 10, 2020