పెదబాబు, చినబాబు తుఫాను బాధితుల 100 కోట్లు మింగేశారు.... విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు...?
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఎన్టీయార్ ట్రస్ట్ లోకి చంద్రబాబు, లోకేష్ లాక్కున్నారని ఆరోపణలు చేశారు. తుఫాను బాధితులకు పంచకుండా పెదబాబు, చినబాబు 100 కోట్ల రూపాయల సొమ్ము మింగేశారని చెప్పారు. ఎన్టీయార్ ట్రస్ట్ పేరుతో చంద్రబాబు, లోకేష్ చేసిన అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నానని చెప్పారు.
చంద్రబాబు ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచారని... ఎన్టీయార్ అమలులోకి తెచ్చిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచారని... ఎన్టీయార్ ట్రస్టును కూడా లాక్కున్నారని అన్నారు. చంద్రబాబు సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటున్నారంటూ విమర్శలు చేశారు. సీనియర్ ఎన్టీయార్ ఏ లోకంలో ఉన్నా అల్లుడి అరాచకాలపై కొరడా తీయాలని అన్నారు.
pic.twitter.com/QqWzXfAS92 — Vijayasai reddy v (@VSReddy_MP) May 6, 2020
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారు. మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ ట్రస్టును లాక్కున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారు. తుఫాను బాధితులకు అంటూ కలెక్షన్లులాగి కోట్లు మింగేశారు... ఏ లోకంలో ఉన్నారోగానీ, ఎన్టీఆర్గారూ... మీ అల్లుడి అరాచకాల మీద ఇక కొరడా తీయండి! — Vijayasai reddy v (@VSReddy_MP) May 6, 2020