తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభవార్త... మే 2 నుంచి 1500 రూపాయలు జమ... కానీ.. ?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. మే నెల 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు 1500 రూపాయలు నగదు జమ చేయనున్నట్టు ప్రకటించారు. రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. సివిల్ సప్లై ద్వారా 4 జిల్లాల్లో కందిపప్పు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రేపటినుంచి ఉచిత బియ్యం పంపిణీ జరగనుంది. 
 
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. గత నెలలో ప్రభుత్వం 1500 రూపాయలు పంపిణీ చేసింది. ప్రభుత్వం నగదు పంపిణీ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతూ ఉండటంతో ప్రభుత్వం ఈ నెల కూడా 1500 రూపాయలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
గత కొన్ని నెలల నుండి రేషన్ తీసుకోని వారికి నగదు పంపిణీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: