చంద్రబాబు ఆ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు... విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబును టార్గెట్ చేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి తన ట్వీట్లో కరోనా వైరస్ ఎన్నిరకాలుగా సోకుతుందో అంతుచిక్కడం లేదని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రపంచంలో చోటు చేసుకునే ప్రతి పరిణామం తనకు మాత్రమే తెలుసని అనుకుంటాడని... సైకాలజీలో హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని పిలిచే మానసిక రుగ్మతతో చంద్రబాబు బాధ పడుతున్నాడని చెప్పారు.
బాబు మానసిక వ్యాధులలో ఇది కూడా ఒక తీవ్ర సమస్యే అని పేర్కొన్నారు. మరో ట్వీట్లో కరోనాను కంట్రోల్ చేసే స్విచ్చే తమ దగ్గరుందని విజయసాయిరెడ్డి అన్నారు. కరోనా మా దరిదాపుల్లోకి కూడా రాదని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ప్రధాని చెప్పినా మాస్క్ కట్టుకోమని చెబుతూ సవాల్ విసురుతున్నారని... ఆ వింతను కూడా చూడాలనుకుంటున్నానని పేర్కొన్నారు. మనకు మాస్క్ జీవితంలో భాగమవుతుందని మోదీగారు చెప్పడాన్ని కూడా చంద్రబాబు తప్పుబడుతున్నారని పేర్కొన్నారు.
ఎన్ని రకాలుగా సంక్రమిస్తుందో ఇంకా పూర్తిగా అంతుచిక్కని కోవిడ్ నుంచి, ప్రపంచంలో చోటుచేసుకునే ప్రతి పరిణామం తనకు మాత్రమే తెలుసనే భ్రాంతిలో మునిగే రుగ్మతను సైకాలజీలో హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ (HPD) అని పిలుస్తారు. బాబు మానసిక వ్యాధుల జాబితాలో ఇదీ ఒక తీవ్ర సమస్యే. — Vijayasai reddy v (@VSReddy_MP) April 30, 2020
కరోనాను కంట్రోల్ చేసే స్విచ్చే మా దగ్గరుంది. మా దరిదాపుల్లోకి కూడా రాదు. ప్రధాని చెప్పినా సరే ముఖానికి మాస్క్ కట్టుకునేది లేదని తండ్రీకొడుకులు సవాళ్లు విసురుతున్నారట. ఆ వింతనూ చూడాలి. మనకు మాస్క్ జీవితంలో భాగమవుతుందని మోదీ గారు చెప్పడాన్ని కూడా తప్పు పడుతున్నట్టున్నారు. — Vijayasai reddy v (@VSReddy_MP) April 30, 2020