రిషీ కపూర్ మృతి చాలా బాధాకరం... సంతాపం వ్యక్తం చేసిన మోదీ, అమిత్ షా...!

Reddy P Rajasekhar

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఈరోజు ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిషీ కపూర్ మృతిపై ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. అమిత్ షా తన ట్వీట్లో రిషీ కపూర్ మృతి చాలా మృతి చాలా బాధాకరమైన ఘటన అని అన్నారు. రీషీ కపూర్ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కోలుకోలేని నష్టం అని చెప్పారు. 
 
రిషీ కపూర్ తన అసాధారణమైన ప్రతిభతో ఎల్లప్పుడూ గుర్తుంచుకోబడతాడని చెప్పారు. అతని కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ రిషీకపూర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. మోదీ రిషీ కపూర్ ప్రతిభకు కొలమానం అని అన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడని చెప్పారు. అతని మరణవార్త తెలిసి ఎంతో బాధ పడ్డానని అన్నారు. 
 
సోషల్ మీడియాలో కూడా రిషీ కుమార్ గురించి పలు సందర్భాల్లో పోస్టులు చేశానని అన్నారు. రిషీ కపూర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: