మృత దేహంతో మూడు వేల కి.మీ. ప్రయాణం.. షభాష్ అన్న సీఎం!

Edari Rama Krishna

ఈ కాలంలో మానవ సంబంధాలు ఎంత దారుణంగా తయారయ్యాో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అన్నదమ్ముల్లో అనుబంధం లేదు.. కన్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు.. భార్యాభర్తల్లో అపోహలు.. అలకలు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నన్నో ఉన్నాయి.  కానీ కొన్ని సార్లు మానవత్వం ఇంకా బతికే ఉందన్న సందర్భాలు ఉన్నాయి.  ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. కరోనా వస్తుందన్న భయంతో రక్తసంబంధీకులు కూడా మృతదేహాలను ముట్టుకోవడం లేదు. ఇంతటి కలికాలంలో మానవత్వం పరిమళించింది. అంబులెన్స్  డ్రైవర్లు ఇద్దరు విస్తుగొలిపే సాహసం చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. మృతదేహంతో ఏకంగా పలు రాష్ట్రాల గుండా సాగి 3 వేల కి.మీ. దూరం ప్రయాణించారు. 

 

మిజోరంకు చెందిన వివియన్‌ లాల్రేంసగా అనే యువకుడు చెన్నైలో పనిచేస్తూ గతవారం గుండెపోటుతో చనిపోయాడు. లాక్ డౌన్ వల్ల మృతదేహాన్ని అతని కుటుంబం వద్దకు చేర్చడానికి సమస్యలు ఎదరయ్యాయి. అయితే జయంతజీరన్‌, చిన్నతంబీ అనే అంబులెన్సు డ్రైవర్లు తాము తీసుకెళ్తామన్నారు.

 

వివియన్‌ స్నేహితుడు దారి చూపుతుండగా మూడున్నర రోజులు  ప్రయాణించారు.  3 వేల కిలోమీటర్లను 84 గంటల సమయంలో దాటేసి  బుధవారం ఐజ్వాల్‌కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ అంబులెన్స్ వస్తుంటే రోడ్డుపైకి చప్పట్లతో అభినందించారు.  ఈ విషయం తెలుసుకొని మీరే అసలైన హీరోలు అని సీఎం జోరంతంగా ట్వీట్ చేశారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: